రైల్వే బడ్జెట్ 2014 -15 హైలెట్స్.. కొత్త రైళ్లు లిస్ట్...

మంగళవారం, 8 జులై 2014 (17:35 IST)
లోక్‌సభలో రైల్వే బడ్జెట్ 2014-15ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రవేశపెట్టారు. రైల్వే ప్రయాణికుల భద్రతే తమ ప్రధానాంశమని ప్రకటించారు. సరుకు రవాణాలో ప్రపంచంలో అగ్రగామిగా నిలవడమే ధ్యేయమన్నారు. సరుకు రవాణాలో చైనా, రష్యాలాంటి దేశాల తర్వాత తామే ఉన్నామని చెప్పారు. ఇటీవల పెంచిన రైల్వే చార్జీల వల్ల రైల్వే శాఖకు రూ.8 వేల కోట్ల ఆదాయం వచ్చిందని, ఈ యేడాది మొత్తంగా రూ. 602 కోట్లు మిగుల ఆదాయమే తమ లక్ష్యమని ప్రకటించారు. 
 
ఇదిలావుండగా, లోక్‌సభలో సోమవారం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో కొత్తగా ఐదు జనసాధారణ్, 5 ప్రీమియం, 27 ఎక్స్‌ప్రెస్, 6 ఏసీ, 8 ప్యాసింజర్, రెండు మెమో, ఐదు డెమో రైళ్లను ప్రవేశపెడుతున్నట్టు కేంద్రమంత్రి సదానందగౌడ లోక్ సభలో ప్రకటించారు. అయితే, ఉమ్మడి రాజధాని హైదరాబాదుకు రెండు సెమీ బులెట్ రైళ్లను మంత్రి ప్రకటించారు. ఇందులో ఒక రైలు చెన్నై-హైదరాబాద్ మధ్య, రెండో రైలు విజయవాడ-హైదరాబాదు మధ్య సెమీ బులెట్ రైళ్లు వేస్తున్నట్టు తెలిపారు. ఇంకా బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. 
 
*ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టుల కోసం రూ.20,680 కోట్లు అవసరం
* ముంబై - అహ్మదాబాద్ మధ్య తొలి బులెట్ ట్రయిన్. 
* చార్థామ్, కేదారనాథ్, బద్రీనాథ్లకు రైల్వే కనెక్టివిటీ. 
* కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ రైల్వేలైన్ల అనుసంధానం. 
* త్వరలో రైల్వే యూనివర్సిటీ ఏర్పాటు 
* ఈశాన్య రాష్ట్రాలకు ఏకో టూరిజం రైళ్లు, ఎడ్యుకేషన్ రైళ్లు 
* 2014-15 ఆదాయం అంచనా రూ. 1,64,000 కోట్లు. 
* ఛార్జీల పెంపుతో రూ. 8 వేల కోట్ల ఆదాయం 
* అన్ని ప్రధాన స్టేషన్లలో లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు.
* వృద్ధులు, వికలాంగుల కోసం రైల్వే స్టేషన్లలో బ్యాటరీ వాహనాలు. 
* స్టేషన్లలో శుభ్రతను పరిశీలించేందుకు సీసీటీవీలు. 
* ప్రధాన రైళ్లలో ఆన్ బోర్డ్ హౌస్ కీపింగ్ సౌకర్యాలు. 
* కోచ్, రైలును కూడా బుక్ చేసుకునే అవకాశం. 
* డబ్లింగ్, ట్రిప్లింగ్ లకు మొదటి ప్రాధాన్యత. 
* కొత్త రైల్వే లైన్లకు రెండో ప్రాధాన్యత. 
* ప్రైవేటు భాగస్వామ్యంతో మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత. 
* 50 మేజర్ స్టేషన్లలో ఔట్ సోర్సింగ్ విధానంలో పారిశుధ్యత కార్యక్రమాలు.
* ఆర్పీఎఫ్ సిబ్బందికి మొబైల్ ఫోన్లు. 
* రైల్వే సిబ్బంది సంక్షేమ నిధి రూ.500 కోట్ల నుంచి రూ.800 కోట్లకు పెంపు. 
* రూ.100 కోట్లతో ప్రధాన నగరాల మధ్య హైస్పీడ్ నెట్ వర్క్ 
* భద్రత కోసం త్వరలోనే 17000 ఆర్పీఎఫ్ సిబ్బంది. 
* కాపలాలేని 5400 రైల్వే లెవెల్ క్రాసింగ్‌ల మూసివేత.
* రైళ్లలో మహిళల భద్రత కోసం 4 వేల మంది మహిళా కానిస్టేబుళ్ల నియామకం.
* రైల్వే యూనివర్శిటీ స్థాపన 
* ఆన్‌లైన్ ద్వారా ప్రయాణ, ప్లాట్ ఫాం టికెట్ల విక్రయం. 
* పోస్టాఫీసుల్లో రైల్వే రిజర్వేషన్ సౌకర్యం 
* ఐదేళ్లలో పేపర్ లెస్ కార్యాలయాలు. 
* పార్కింగ్, ప్లాట్ ఫాం కాంబో టికెట్ల విక్రయాలు. 
* విమానాశ్రయాల స్థాయిలో ప్రధాన రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ. 
* ఎంపిక చేసిన రూట్లలో రైళ్ల వేగం గంటకు 160-200 కి.మీటరకు పెంపు.
* 10 మెట్రో స్టేషన్లను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాం. 
* ఎ-1 స్టేషన్లు, ఎ-1 రైళ్లలో వైఫై సౌకర్యం. 

రైల్వే మంత్రి సదానంద గౌడ ప్రవేశపెట్టిన 2014-15 వార్షిక బడ్జెట్‌లో మొత్తం 58 కొత్త రైళ్ళను ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించిన ఆయన.. 11 రైళ్ల గమ్య స్థానాలను పొడగించారు. కొత్తగా ప్రకటించిన రైళ్ళలో ఐదు జనసాధారణ్ రైళ్లు, ఐదు ప్రీమియం ట్రైన్స్, ఆరు ఏసీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 27 ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 8 ప్యాసింజర్ రైళ్లు, 2 మెము (ఎంఈఎంయు) రైళ్లు, ఐదు డెము (డీఈఎంయు) రైళ్లు ఉన్నాయి. 
 
జన్‌సాధారణ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు 
1. అహ్మదాబాద్ - దర్భంగా ఎక్స్‌ప్రెస్ 
2. జయనగర్ - ముంబై ఎక్స్‌ప్రెస్
3. ముంబై - గోరఖ్ పూర్ ఎక్స్‌ప్రెస్
4. సహరసా - ఆనంద్ విహార్ వయా మతిహరి
5. సహరసా - అమృతసర్ ఎక్స్‌ప్రెస్ 
 
ప్రీమియం ఏసీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు 
1. ముంబై సెంట్రల్ - న్యూఢిల్లీ ఏసీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు 
2. షాలిమార్ - చెన్నై ఏసీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు 
3. సికింద్రాబాద్ - హజ్రరత్ నిజాముద్దీన్ ఏసీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు 
4. జైపూర్ - మదురై ఏసీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు 
5. కమఖ్యా - బెంగుళూరు ఏసీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు 
 
ఏసీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు 
1. విజయవాడ - న్యూఢిల్లీ ఏసీ ఎక్స్‌ప్రెస్ (డైలీ)
2. లోకమాన్య తిలక్ - లక్నో ఏసీ ఎక్స్‌ప్రెస్ (వీక్లీ)
3. నాగ్‌పూర్ - పూణె ఏసీ ఎక్స్‌ప్రెస్ (వీక్లీ)
4. నాగ్‌పూర్ - అమృతసర్ ఏసీ ఎక్స్‌ప్రెస్ (వీక్లీ)
5. నహర్లాగున్ - న్యూఢిల్లీ ఏసీ ఎక్స్‌ప్రెస్ (వీక్లీ)
6. నిజాముబ్దీన్ - పూణె ఏసీ ఎక్స్‌ప్రెస్ (వీక్లీ)
 
ఎక్స్‌ప్రెస్ రైళ్లు 
1. అహ్మదాబాద్ - పాట్నా ఎక్స్‌ప్రెస్ వయా వారణాసి 
2. అహ్మదాబాద్ - చెన్నై ఎక్స్‌ప్రెస్ (బై వీక్లీ వయా వాసై రోడ్డు)
3. బెంగుళూరు - మంగుళూరు ఎక్స్‌ప్రెస్ (డైలీ)
4. బెంగుళూరు - షిమొగ్గా ఎక్స్‌ప్రెస్ (బై వీక్లీ)
5. బాంద్రా - జైపూర్ ఎక్స్‌ప్రెస్ (వీక్లీ వయా నగ్దా, కోట)
6. బిదర్ - ముంబై ఎక్స్‌ప్రెస్ (వీక్లీ)
7. చాప్రా - లక్నో ఎక్స్‌ప్రెస్ (ట్రై వీక్లీ వయా బాలియా, ఘజీపూర్, వారణాసి)
8. ఫిరోజ్‌పూర్ - చండీగఢ్ ఎక్స్‌ప్రెస్ (6 రోజులు)
9. గౌహతి - నహర్లాగున్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ (డైలీ)
10. గౌహతి - ముర్కోంగ్‌సెలెక్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ (డైలీ)
11. గోరఖ్‌పూర్ - ఆనంద్ విహార్ ఎక్స్‌ప్రెస్ (వీక్లీ)
12. హపా - బిలాస్ పూర్ ఎక్స్‌ప్రెస్ (వీక్లీ వయా నాగ్‌పూర్)
13. హుజుర్ సహెబ్ నాందేడ్ - బైకనూరు ఎక్స్‌ప్రెస్ (వీక్లీ)
14. ఇండోర్ - జమ్ముతావి ఎక్స్‌ప్రెస్ (వీక్లీ)
15. కమఖ్య - కట్రా ఎక్స్‌ప్రెస్ వయా దర్భంగా
16. కాన్పూర్ - జమ్ముతావి ఎక్స్‌ప్రెస్ (బై వీక్లీ)
17. లోకమాన్య తిలక్ - అజం‌గఢ్ ఎక్స్‌ప్రెస్ (వీక్లీ)
18. ముంబై - కాజీపేట్ ఎక్స్‌ప్రెస్ వయా బల్హార్సాహ్ (వీక్లీ)
19. ముంబై - పాటియాలా ఎక్స్‌ప్రెస్ (వీక్లీ)
20. న్యూఢిల్లీ - భతిందా శతాబ్ది ఎక్స్‌ప్రెస్ (బై వీక్లీ)
21. న్యూఢిల్లీ - వారణాసి ఎక్స్‌ప్రెస్ (డైలీ)
22. పారాదీప్ - హౌరా ఎక్స్‌ప్రెస్ (వీక్లీ)
23. పారదీప్ - విశాఖపట్టణం ఎక్స్‌ప్రెస్ (వీక్లీ)
24. రాజ్‌కోట్ - రెవా ఎక్స్‌ప్రెస్ (వీక్లీ)
25. రాంనగర్ - అగ్రా ఎక్స్‌ప్రెస్ (వీక్లీ)
26. టాటా నగర్  - బయ్యప్పనహల్లి ఎక్స్‌ప్రెస్ (బెంగుళూరు వీక్లీ)
27. విశాఖపట్నం - చెన్నై ఎక్స్‌ప్రెస్ (వీక్లీ)
 
ప్యాసింజర్ రైళ్లు 
1. బైకనూరు -రెవారి ప్యాసింజర్ (డైలీ)
2. ధర్వాడ్ - దండేలి ప్యాసింజర్ (డైలీ) వయా అల్నావర్
3. గోరఖ్‌పూర్ - నౌతన్యా ప్యాసింజర్ (డైలీ)
4. గౌహతి - మెందిపదార్ ప్యాసింజర్ (డైలీ)
5. హతియా - రూర్కెలా ప్యాసింజర్
6. బిండోర్ - కాసర్‌గాడ్ ప్యాసింజర్ (డైలీ)
7. రంగపారా నార్త్ - రంగియా ప్యాసింజర్ (డైలీ)
8. యశ్వంత్‌పూర్ - తుమ్కూర్ ప్యాసింజర్ (డైలీ)
 
మెము సర్వీసులు
1. బెంగుళూరు - రామనగరం (వారంలో ఆరు రోజులు)
2. పల్వాల్ - ఢిల్లీ - అలీగఢ్
 
డెము సర్వీసులు 
1. బెంగుళూరు - నీల్‌మంగళ (డైలీ)
2. చాప్రా - మందుయాడిహ్ వయా బాలియా (వారంలో 6 రోజులు)
3. బారాముల్లా - రూర్కెలా (వారంలో 6 రోజులు)
4. సాంబల్‌పూర్ - రూర్కెలా (వారంలో 6 రోజులు)
5. యశ్వంత్‌పూర్ - హోసూర్ (వారంలో 6 రోజులు)
 
రైళ్ల పొడగింపు 
1. ఆనంద్ విహార్ గరీభ్ రథ్ ఎక్స్‌ప్రెస్ - గయ వరకు 
2. ఢిల్లీ సరాయ్ రోహిల్లా శ్రీగంగానగర్ ఎక్స్‌ప్రెస్ - బైకనూర్ వరకు
3. గోండియా ముజఫర్‌పూర్ ఎక్స్‌ప్రెస్ - బరౌణి వరకు. 
4. న్యూఢిల్లీ భోపాల్ శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ - హబీబ్‌గంజ్ వరకు. 
5. లుథియానా హిస్సార్ ప్యాసింజర్ - సాదుల్‌పూర్ వరకు 
6. సోన్పూర్ కప్టాన్‌గంజ్ ప్యాసింజర్ - గోరఖ్‌పూర్ వరకు. 
7. గోరఖ్‌పూర్ - థవే ప్యాసింజర్ రైలు - సివాన్ వరకు 
8. బౌక్సర్ - మొఘల్‌సరాయ్ మెము - వారణాసి వరకు. 
9 జాఝా పాట్నా మెము - జసిదిహ్ వరకు. 
10. లక్నో హర్దోయ్ మెము - షాహజ్నాపూర్ వరకు. 
11. హౌరా - బెల్దా మెము - జలేశ్వర్ వరకు. 

వెబ్దునియా పై చదవండి