ధనుర్మాస వైశిష్ట్యం

ప్రతి సంవత్సరం సూర్యుడు ధనూరాశిలోకి ప్రవేశించి తిరిగి మకర రాశిలోకి వచ్చేంతవరకు మధ్య ఉన్న కాలాన్ని ధనుర్మాసం అంటారు. ఈ ధనుర్మాసం శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ ధనుర్మాసాన్నే మార్గశిర మాసం అనికూడా అంటారు.

ఈ ధనుర్మాసంలో నామ సంకీర్తనం, పుష్ప సమర్పణం, శరణాగతి అనే ఈమూడింటిని ఆచరిస్తే నేనే రక్షిస్తాననిశ్రీవారు భూదేవికి చెప్పారట. అందుకే భూదేవి కలియుగంలో జీవులను భగవంతుని కృపకు పాత్రులుగావడానికి తానే స్వయంగా తమిళనాడు రాష్ట్రంలో తిరువారూర్ జిల్లాలో శ్రీవిల్లి పుత్తూరులో ఆండాళ్(గోదాదేవి)గా అవతరించినట్లు చరిత్ర చెబుతుంది.

ఇదిలా ఉండగా మంగళవారం నుంచి ధనుర్మాసం ప్రారంభం కావడంతో తిరుమలలో తిరుప్పావై నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే శ్రీవేంకటేశ్వర స్వామి వారికి సుప్రభాత సేవతో పాటు ధనుర్మాస పూజలు నిర్వహించారు. ఈ నెల ప్రారంభంనుంచి తొలి పక్షం రోజులవరకు సూర్యోదయానికి పూర్వమే అర్చనాది కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఆ తర్వాత సూర్యోదయం తర్వాత అర్చనాదికార్యక్రమాలు నిర్వహిస్తారు. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈనెలలో వైష్ణవ దేవాలయాల్లో నెల రోజులూ అర్చనాది కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు.

వెబ్దునియా పై చదవండి