శ్రీకృష్ణరాసలీలలు భౌతికపరమైనవా....?

శుక్రవారం, 8 మార్చి 2013 (18:13 IST)
FILE
బృందావనంలో శ్రీకృష్ణుడు గోపికలతో రాసలీలలు చేశాడంటారు. దీనిని భౌతిక ఆనందానికి సంబంధించినదిగా భావించేవారున్నారు. ఆ రాసలీలలు గాథ జీవాత్మ, పరమాత్మ పరంగా చెప్పబడినది. జీవులన్నీ పరమాత్మ చెంతకే చేరాలనుకుంటాయి.

ఆ పరమాత్మని ఒక్కక్షణం కూడా వదలాలనిపించదు. పరమాత్ముని చెంత లభించే ఆనందం అటువంటిది. అటువంటి జీవాత్మలను పరీక్షిస్తాడాయన. తనలో లీనమయ్యేందుకు వారుపడే తపనను గమనించాలనుకుంటాడు.

తననుండి వేరైతే భిన్న అంశాలమీద జీవాత్మ మళ్ళుతుందా! అది తెలుసుకునేందుకే. ఆయన పరీక్ష పెట్టగానే జీవాత్మపడే విరహం భౌతికపరమైనది కాదు, ఆత్మపరంగా పడే విరహం. ఆ సర్వేశ్వరుని విడిచి ఒక్క క్షణంకూడా ఉండలేని జీవాత్మలను తనలో ఐక్యం చేసుకుంటాడు.

ఆ జీవాత్మలను గోపికలుగా, పరమాత్ముడిగా, శ్రీకృష్ణునిగా వారిమధ్య జరిగిన ఆ పరీక్షలనే రాససలీలుగా వివరించడం, వర్ణించడం జరిగింది.

వెబ్దునియా పై చదవండి