సంసారికి భక్తి అనేది ఎలా ఉపయోగపడుతుందో తెలుసా?

సోమవారం, 19 అక్టోబరు 2015 (18:34 IST)
భక్తి జ్ఞానమును ప్రసాదిస్తుంది. భక్తి జ్ఞానమును ప్రసాదిస్తుంది. భక్తి జ్ఞానములు పరస్పరాధారములు. భక్కిలేని జ్ఞానముండదు. జ్ఞానప్రాప్తిచే ప్రపంచ బంధముల నుంచి విముక్తి లభిస్తుంది. ఆ స్థితిని చేరిన మానవుడు అందరిలోనూ ప్రేమనే చూస్తాడు. ఎవరినీ ద్వేషించడు. భక్తితోనే భక్తుడు ఋషి, యోగి అవుతాడు. మానవుడు తన వాంఛితార్థం కోసం భగవంతునిని ప్రార్థిస్తాడు. 
 
అది విషయవాంఛలతో కూడిన భక్తి, భగవంతుడిని తమ రక్షకునిగా భావించి వేదనాబాధలను మొరపెట్టుకుంటారు. భగవంతుడిని బ్రతిమాలుతారు. తామనుకొన్నది నెరవేరకపోతే అలుగుతారు. మళ్ళీ, మళ్ళీ పూజలు చేస్తూనే వుంటారు. సంసారికి భక్తి తాము కోరినవి పొందే సాధనము. భక్తి తన ఆపదావసరములకు ఆలంబన. 
 
సంసారి నిత్యం ఆపదావసరముల మధ్య భగవంతుని ఆపద్భాంధవునిగా భావిస్తాడు. సంసారి విషాదంలో ఉన్నప్పుడు భక్తి ఉధృతముగానూ, సమస్యలు లేనప్పుడు సామాన్యంగా సాగుతూంటుంది. ఫలితాలను విధిరాతని, అదృష్టాదృష్టములి సమర్థించుకుంటారు.

వెబ్దునియా పై చదవండి