కలలో ద్వీపం కనిపిస్తే... ఏం జరుగుతుందో తెలుసా?

సోమవారం, 16 జులై 2018 (11:24 IST)
చీకటిని ఆశ్రయించి అనేక దుష్టశక్తులు విషకీటకాలు ఉంటాయి. అందువలన చీకట్లోకి వెళ్లాలంటే మరో కొత్తలోకంలోకి అడుగుపెడుతున్నట్లుగా భయపడుతుంటారు. ద్వీపాన్ని వెలిగించగానే ఆ వెలుగు చీకటిని తరిమికొడుతుంది. దుష్టశక్తులు ఆ వెలుగును భరించలేక దూరంగా పారిపోతాయి. అందుకే సూర్యోదయానికి ముందు తరువాత ద్వీపం వెలిగించాలని శాస్త్రం చెబుతోంది.
 
చీకటిని చీలుస్తూ ద్వీపం వెలగడం ఆ వెలుగుతో పరిసరాలు కాంతివంతం కావడం తనలో సంతోషం వికసించడం కలలో కనిపిస్తుంటుంది. అద్భుతంగా అనిపించే ఈ దృశ్యం మనోఫలకంపై అలా గుర్తుండిపోతుంది. మెలకువ వచ్చిన తరువాత ఎందుకు ఆ కల వచ్చిందో తెలుసుకోవాలనే ఆతృత కలుగుతుంది. ద్వీపం వెలిగించడం ఎంతటి శుభప్రదమో కలలో ద్వీపం కనిపించడం కూడా అంతే మంచిదని చెప్పబడుతోంది.
 
కొత్త ఆశలు ఫలిస్తాయనడానికి, కొత్త జీవితం ఆరంభమవుతుందనడానికి శుభానికి సంకేతంగా ద్వీపం చెప్పబడుతోంది. ద్వీపం లక్ష్మీదేవి స్వరూపంగా సమస్త శుభకార్యలు ద్వీపం వెలిగించడంతోనే ఆరంభమవుతాయి. సకల దోషాలు ద్వీపం వెలిగించడంతోనే తొలగిపోతాయి. అలాంటి ద్వీపం కలలో కనిపించడాన్ని శుభపరిణామాలకు సంకేతంగా భావించవచ్చని చెప్పబడుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు