వయోవృద్ధులకు టీటీడీ శుభవార్త: శ్రీవారి దర్శనం ఫ్రీ.. 30 నిమిషాలలో..?

మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (22:43 IST)
వయోవృద్ధులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. వయోవృద్ధులకు (అరవై ఏళ్లకు పైబడిన వారు) శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనాన్ని ఉచితంగా కల్పించనుంది టీటీడీ. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది టీటీడీ. ఈ మేరకు కీలక మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. ప్రతి రోజూ ఉదయం 10 గంటల తరువాత వృద్ధులకు దర్శన సౌకర్యం కల్పిస్తామని, అలాగే. సాయంత్రం 3 గంటల సమయంలోనూ వారికి దర్శన సౌకర్యం కల్పిస్తామని టీటీడీ ప్రకటించింది. 
 
అయితే... వీటికి కొన్ని ఆధారాలు చూపించాల్సి ఉంటుందని టీటీడీ పేర్కొంది. ఫోటోతో వున్న వయసు నిర్ధారణ, పత్రాలు "S-1 counter" వద్ద చూపించాల్సి వుంటుందని టీటీడీ తెలిపింది. మాములు భక్తుల లాగా మెట్లు ఎక్కాల్సిన పని లేదని ఆలయానికి కుడివైపు బ్రిడ్జి కింద గోడ పక్కనే వారికి దర్శన మార్గాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. వారి కోసం సాంబారన్నం, పెరుగన్నం, వేడి పాలు ఉచితంగా ఉచింతంగా ఇస్తారని తెలిపింది. 
 
అంతేకాదు... వారికి రూ.20లకు రెండు లడ్డు టోకెన్లు ఇస్తారని... తరువాత రూ.25లకు ఒక లడ్డు చొప్పున ఎన్నైనా టోకెన్లు ఇస్తారని ప్రకటిచింది టీటీడీ. కౌంటరు నుండి గుడికి-గుడి నుండి కౌంటరుకు బ్యాటరీ కారులో ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు తెలిపింది. వీరి దర్శనం కొరకు మిగతా అన్ని క్యూలు నిలిపి వేయబడతాయని... ఎటువంటి వత్తిళ్ళు-తోపులాటలు వుండవని టీటీడీ పేర్కొంది. 30 నిమిషాలలో దర్శనం పూర్తి అవుతుందని పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు