సీతాఫలాలతో లక్ష్మీపూజ: సీతాఫలం చెట్టు ఇంట్లో ఉండవచ్చా?

బుధవారం, 13 మే 2015 (18:15 IST)
సీతాఫలాలతో లక్ష్మీపూజ చేయడం వల్ల దారిద్య్రం తొలగిపోతుంది. సీతాఫలంతో చేసిన వంటకాలు, సీతాఫలంతో లక్ష్మీపూజ చేసేవారికి దారిద్ర్యం తగ్గి, లక్ష్మీ కటాక్షం విస్తృతంగా లభిస్తుందని పండితులు అంటున్నారు. ముఖ్యంగా లక్ష్మీపూజలో ఈ ఫలాన్ని వుంచుతారు. 
 
వాస్తుపరంగా చాలామంది సీతాఫలాన్ని నివాసం వుండే ఇంటి ఆవరణలో పెంచకూడదని భావిస్తారు. ఇంటి ఆవరణలో ఉన్నట్లయితే దాన్ని తీసేయడం లేదా నరికి వేయడం చేయకుండా ఉసిరి లేదా అశోకా మొక్కల్ని అదే పరిధిలో పెంచితే దోషనివారణ పూర్తిగా తొలగిపోతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
 
సీతాఫలం ఆధ్యాత్మికంగా మంచి ఫలితాలు ఇవ్వడంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిని తినేవారికి గుండె సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. సీతాఫలంలోని మెత్తని గుజ్జు పిల్లల ఎదుగుదలకు సహకరిస్తుంది. ఎదిగే పిల్లల ఎముకల పుష్టికి టానిక్ మాది పనిచేస్తుంది.

వెబ్దునియా పై చదవండి