హనుమకు హనుమాన్ ధార అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

శనివారం, 22 సెప్టెంబరు 2018 (11:35 IST)
వనవాస సమయంలో సీతారాములు నడయాడిన ప్రదేశాలు పుణ్యక్షేత్రాలు ప్రసిద్ధి చెందాయి. అటువంటి పరమ పవిత్రమైన క్షేత్రాలలో చిత్రకూటం ఒకటిగా కనిపిస్తుంది. సీతారాములు 14 ఏళ్ల వనవాస కాలంలో 11 ఏళ్ల పాటు తిరిన ప్రదేశంగా చిత్రకూటం అని పురాణాలలో చెబుతున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణం నచ్చిన కారణంగానే సీతారాములు అంతకాలం పాటు ఇక్కడ ఉండిపోయారు.
 
ఇక్కడ రామ్‌ఘాట్, జానకీ కుండ్, అనసూయ మాత ఆలయం, గుప్త గోదావరి వంటివి మంచి అనుభూతిని కలిగిస్తుంటాయి. సీతారాములు తిరిగిన ఆనవాళ్లకు సాక్షిగా నిలుస్తూ ఇక్కడ మందాకినీ నది ప్రవహిస్తుంటుంది. హనుమార్ ధారను చూస్తే కలిగే అనుభూతే వేరు. 
 
హనుమ లంకా దహనం చేసిన కారణంగా తోకతో పాటు చర్మంపై కూడా కాలిన గాయాలు అయ్యాయి. హనుమ ఆ బాధ నుండి బయటపడడానికి రాముడు నీటిధారను సృష్టించారు. ఈ నీటిధారను హనుమ కోసం సృష్టించిన కాబట్టి దీనిని హనుమాన్ ధార అని పిలుస్తుంటారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు