ఇంటికి ఎలాంటి కోడలిని ఎంపిక చేసుకోవాలని శాస్త్రం చెపుతోంది?

సోమవారం, 19 జూన్ 2017 (15:57 IST)
పూర్వకాలంలో మంచి గుణగణాలున్న అమ్మాయి కోసం గాలించే క్రమంలో ఏడు జతల చెప్పులు అరిగిపోయేలా తిరిగేవారనీ మన పెద్దలు చెపుతుంటారు. ఇంటికి కాబోయే కోడలిని తెచ్చుకోవాలంటే కొన్ని విషయాలను తప్పకుండా పరిశీలించాల్సిందేనని శాస్త్రం కూడా చెపుతోంది. వీటిలో ముఖ్యంగా యువతి వంశ క్రమాన్ని నిశితంగా పరిశీలించాలట. యువతి వంశ క్రమం మంచిదేనా అని ఆరా తీయాలట. 
 
అలాగే, అమ్మాయి విషయానికి వస్తే విత్తము, రూపము, బంధుజనము, శీలం (ప్రవర్తన) అనే అంశాలను గమనించాలట. వీటిలో ముఖ్యంగా శీలాన్ని నిశితంగా పరిశీలించాలట. పొడగిట్టని స్వభావం ఉన్న అమ్మాయిని తెచ్చుకుంటే ఆ ఇంట కష్టాలు ఉంటాయట. అలాగే, చిల్లుకుండ స్వభావం.. అంటే ఈ తరహా స్వభావం ఉన్న యువతి ఇంట్లోకి అడుగుపెడితే ఇంట్లో ధనం ఎంత నిల్వ ఉన్నప్పటికీ అవి మంచినీటిలా కరిగిపోవాల్సిందేనట. 
 
తమ బిడ్డ స్వభావానికి సరిపోయే అమ్మాయినే వెతికి పెళ్లి చేయాలట. అలాకాని అమ్మాయితో వివాహం చేయడం వల్ల ఆ వరుడు ప్రశాంతంగా సంసార జీవితాన్ని కొనసాగించలేడట. మరీ ముఖ్యంగా ఎంచుకున్న యువతి, యువకుల వరుసలు మారిపోకుండా జాగ్రత్తగా చూడాలి. ప్రధానంగా దూరపు బంధువులపరంగా ఆరా తీసినపుడు వారిద్దరు అన్నా చెల్లెళ్ల వరుస కాకుండా చూడాలి. అలాగే, ఒకే గోత్రం కలిగిన యువతీ యువకులకు పెళ్ళి చేయరాదని శాస్త్రం చెపుతోంది. అంటే సపిండ, సగోత్ర, సప్రవర అనే మూడు విషయాలను జాగ్రత్తగా చూసి ఇంటికి కోడలిగా ఎంచుకోవాలని శాస్త్రం చెపుతోంది. 

వెబ్దునియా పై చదవండి