అరటి ఆకుపై భోజనాన్ని ఎలా వడ్డించాలి? (video)

మంగళవారం, 8 డిశెంబరు 2020 (22:08 IST)
అన్నం తినడం కేవలం కడుపు నింపుకోవడం ఒక్కటే కాదు. అనేక దేవతాశక్తుల ప్రభావం అన్నం పైన వుంటుంది. జీవకోటికి దేహ, మనఃప్రాణాలను సమకూర్చే అన్నాన్ని పవిత్రం చేసుకోవడం వల్ల జీవితం శుద్ధమై, సిద్ధులను పొందగలదు. అందుకే నియమాలున్నాయి.
 
అరటి ఆకును వేసేటపుడు ఈనె తీయకూడదు. ఆకు చివరి భాగం ఎడవైపు వుండేట్లు పెట్టుకోవాలి. విస్తరిలో మొదట ఎదురుగా కూరలు, కూరల వడ్డన తర్వాత విస్తరి మధ్యలో అన్నం, ఆ తర్వాత విస్తరిలో కుడివైపు పాయసం, పప్పు వేయాలి.
 
ఎడమ వైపు పిండి వంటలు, చారు, చివరకు పెరుగు వడ్డించాలి. భోజనం ప్రారంభించకముందే ఉప్పును వడ్డించకూడదు. ఉప్పు ఒక్కదాన్నే ప్రత్యేకంగా వడ్డించకూడదు. తినడానికే ముందే ఉప్పునూ, తినడం ప్రారంభమైన తర్వాత నేతినీ, పాయసాన్ని వడ్డించకూడదు. పాయసాన్నీ, నేతిని ముందుగానే వడ్డించాలి. పౌర్ణమి, అమవాస్యలలో రాత్రిపూట భోజనం చేయకూడదు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు