అష్టాదశ శక్తి పీఠాల్లో చివరిది శ్రీ సరస్వతీ దేవి శక్తి పీఠం. జమ్మూ కాశ్మీర్‌లో వెలసిన ఈ శక్తి పీఠం పూర్వం మతపరమైన దాడులకు గురైనది. అంతే కాకుండా ప్రకృతి పరమైన వైపరీత్యాల కారణంగా కూడా ఇక్కడి ఆలయం క్రమేణా శిథిలం కావడం మెుదలైంది. దాంతో శ్రీ ఆదిశంకచార్యుల వారు అమ్మవారి శక్తిని స్వర్ణ సరస్వతీదేవి రూపంలోకి ఆవాహన చేసి శృంగేరి మఠానికి తీసుకువచ్చారు.