కార్తీక మాసం: కోటి సోమవారాలు రేపే...

బుధవారం, 10 నవంబరు 2021 (23:03 IST)
కోటి సోమవారాల రోజున శివాలయ సందర్శనం, అభిషేకం, ఉపవాసం లేదా నక్తం లేదా ఏకభుక్తం ఎవరి శక్తి అనుసారం వారు చేస్తే మంచిది. అదేవిధంగా ఈ రోజు దీపారాధన, ఆకాశదీప దర్శనం, దానాలు, ధర్మాలు చేస్తే ఆ ఫలితం రెట్టింపు అవుతుందని పురాణాలు చెప్తున్నాయి. 

 
కోటి సోమవారాల రోజున ఓం నమఃశివాయ పంచాక్షరితో భక్తి ప్రపత్తులతో శివునికి ఉపవాసం చేస్తే అనంత పుణ్యఫలాలు కలుగుతాయని విశ్వాసం. ఆలయాల్లో శివునికి అభిషేకం చేయించడం, నేతితో దీపమెలిగించడం ద్వారా సకలసంపదలు చేకూరుతాయి. 

 
పార్వతీపరమేశ్వరులను స్తుతిస్తూ నేతితో దీపమెలిగించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. పుణ్యఫలం చేకూరుతుందని పండితులు చెప్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు