ధర్మం ఎక్కడ కొలువై ఉంటుందో.. కృష్ణుడు అక్కడే ఉంటాడు!

సోమవారం, 18 ఆగస్టు 2014 (18:57 IST)
"ధర్మం" ఎక్కడ కొలువై ఉంటుందో శ్రీ కృష్ణభగవానుడు.. అక్కడే ఉంటాడని భక్తుల విశ్వాసం. దుష్టశిక్షణార్థం భూలోకమున అవతరించిన శ్రీ కృష్ణుడిని నిత్యం స్మరించుకునే వారికి సకల సంపదలు చేకూరుతాయి. 
 
మహిమాన్వితుడైన శ్రీ కృష్ణుడు తన కృష్ణావతారంలో మూడుసార్లు విశ్వరూపం దాల్చాడని పురాణాలు చెబుతున్నాయి. 
 
అందులో కౌరవ సభ ఒకటైతే.. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునునికి గీతోపదేశం చేసే సమయం, దానకర్ణుడు యుద్ధభూమిలో ప్రాణాలను విడిచే సందర్భాన కృష్ణ పరమాత్మ విశ్వరూపమెత్తినట్లు పురాణాలు పేర్కొన్నాయి.
 
అందుచేత మానవుని రూపంలో జన్మించి, నవభారత నిర్మాణానికి సూత్రధారి అయిన ఆ దేవదేవుని ప్రార్థించేవారికి తెలియక చేసిన పాపాలు హరించిపోతాయని విశ్వాసం.

వెబ్దునియా పై చదవండి