కార్తీకమాసంలో శివుడిని ఆరాధిస్తే..?

సోమవారం, 16 నవంబరు 2015 (17:23 IST)
కార్తీకమాసంలో శివుడిని పూజించడం వలన ఆయురారోగ్యాలు లభిస్తాయి. ముక్తి మార్గంలోకి ప్రవేశించే అర్హత లభిస్తుంది. ఇక పార్వతీదేవి సర్వమంగళ కనుక, ఆ తల్లిని ఆరాధించడం ద్వారా సకల సౌభాగ్యం కలుగుతుంది. కుమారస్వామిని సేవించడం వలన సర్ప సంబంధమైన దోషాలు తొలగిపోయి, సంతాన భాగ్యం కలుగుతుంది. ఇక గణపతిని పూజించడం వలన తలపెట్టిన కార్యక్రమాలకి ఎలాంటి విఘ్నం కలగకుండా సఫలీకృతమవుతాయి.
 
ఇలా శివ కుటుంబంలో ఒక్కొక్కరిని పూజించడం వలన ఒక్కో విశేషమైన ఫలితం లభిస్తుంది. అందుచేత కార్తీకమాసంలో ఒక్క శివుడినే మనసునందు నిలుపుకుని ఆరాధించినా, పార్వతీదేవి .. కుమారస్వామి .. గణపతి కూడా ప్రీతిచెంది తమ అనుగ్రహాన్ని కూడా అందిస్తారని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. ఇలా శంకరుడిని సేవించడం వలన సకల శుభాలు కలుగుతాయి.

వెబ్దునియా పై చదవండి