జగము నందలి సమస్త కర్మలు ప్రకృతిజన్య త్రిగుణముల చేతనే నిర్వహించబడుచున్నవి. ఈ త్రిగుణములు దేవదేవుడైన శ్రీకృష్ణుని నుండియే కలుగుచున్నను అతడెన్నడును వాటిచే ప్రభావితుడు కాడు. ఉదాహరణకు రాజ్యాంగ నియములచే ఎవరైనను శిక్షింపబడవచ్చునేమోగానీ, ఆ రాజ్యాంగమును తయారుచేసిన రాజు మాత్రము రాజ్యాంగ నియములకు అతీతుడై యుండును.