మహాశివరాత్రి రోజున రుద్రాభిషేకం చేయించండి.!

మంగళవారం, 17 ఫిబ్రవరి 2015 (16:41 IST)
మాఘమాసంలో వచ్చే బహుళ పక్ష చతుర్దశి 'మహాశివరాత్రి'గా వైభవంగా జరుపుకుంటారు. శివ స్తోత్రాలు పఠిస్తూ బిల్వదళాలతో స్వామిని సేవించాలి. వివిధరకాల పండ్లు, పిండివంటలు నైవేద్యంగా సమర్పించాలి. 'ఓం నమః శివాయ' అనే పంచాక్షరీ మంత్రన్నీ స్మరిస్తూ గానీ, శివసంబంధమైన కీర్తనలు ఆలపిస్తూ .. భజనలు చేస్తూ గాని జాగరణ పూర్తిచేయాలి.
 
ఈ రోజున చేసే రుద్రాభిషేకం అనంతమైన పుణ్యఫలాలను ఇస్తుంది. సాధారణంగా తెలిసో తెలియకో పాపాలు, దారిద్ర్యాలు, ఈతిబాధలు, అనారోగ్య సమస్యలు దరిచేరవు. మహాశివరాత్రి రోజున చేసిన రుద్రాభిషేక ఫలితం వలన అలాంటి పాతకాలన్నీ ప్రక్షాళన చేయబడతాయి.
 
సూర్యుడి రాకవలన చీకటి ఎలా అదృశ్యమవుతుందో, మహాశివరాత్రి రోజున మహాశివుడికి చేసిన రుద్రాభిషేకం వలన పాపాలు అలా పటాపంచలవుతాయని పండితులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి