తమిళనాడులోని తిరుక్కరుకావూర్‌లోని కర్పరచ్చకాంబికై ఆలయంలో నవగ్రహాలన్నీ ఒకే దిశవైపు తిరిగి ఉంటాయట. అంటే మధ్యలో ఉండే సూర్య గ్రహానికి అభిముఖంగా మిగిలిన గ్రహాలు చుట్టూ ఉంటాయి. అయితే ఇంకో విషయం ఏమిటంటే నవగ్రహాలకు మంత్రాలు పఠించడం, ధ్యానం చేయడం అంటే చాలా ఇష్టమట. నవగ్రహాలకు మంత్రాలు జపిస్తూ పూజిస్తే.. సకల సౌభాగ్యాలు చేకూరుతాయని విశ్వాసం.
తిరువారూరులో ఉన్న త్యాగరాజర్ ఆలయం, మధురై సమీపంలో ఉన్న కారియాపట్టి వైదీశ్వరన్ ఆలయాల్లో ఒకే వరుసలో నవగ్రహాలు కనిపిస్తాయి. అంటే ఒక గ్రహం తర్వాత ఇంకోటి అన్నట్టుగా వరుసలో ఉంటాయి. వీటి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.