ఆరాధన అంటే ఏంటి?

శుక్రవారం, 1 ఆగస్టు 2014 (14:29 IST)
ఆరాధన అంటే గుడ్డి నమ్మకం మాత్రం కాదు. ఓ పనికిమాలిన దాన్ని గుడ్డిగా నమ్మే మనుషులు. తాము ఇతరుల కన్నా చాలా అధికులమని భావిస్తుంటారు. కానీ దేనినైనా మనం గుడ్డిగా నమ్ముతున్నామంటే, దానివల్ల ఏమీ లాభం లేకపోగా మూర్ఖత్వానికి ఆత్మవిశ్వాసం తోడవుతుంది. విశ్వాసానికి మూర్ఖత్వం తోడైతే చాలా అనర్థం. ఈ రెండూ ఓ చోట చేరకూడదు. 
 
కానీ ఎక్కడ చూసినా తరచుగా మనకు ఈ రెండు కలిసికట్టుగానే కనిపిస్తాయి. అది వాటి స్వభావం. అలాగే... బుద్ధికుశలత, సందేహం అనేవి రెండూ కలిసి కనిపించడమూ అంతే సహజం. మనమెంత తెలివిమంతులమైనా మనలో సందేహం కూడా అంత ఎక్కువగానూ పెరిగి కూచుంటుంది.
 
ఎందుకంటే, మన చుట్టూ ఉన్న అన్ని అంశాలను పరికించి చూసినపుడు మనకు తెలిసింది ఆవగింజలో అరవయ్యో వంతైనా లేదని అర్థమవుతుంది. అప్పుడు విశ్వాసంతో ముందడుగు వేయడానికి ఆస్కారమే ఉండదు. అయితే గుడ్డి నమ్మకం అనేది అలవరచుకుంటే ఈ సమస్య ఉండనే ఉండదు. అది అంతులేని విశ్వాసాన్ని ఇస్తుంది. కానీ మూర్ఖత్వానికి అది ముగింపు ఇవ్వలేదు. 

వెబ్దునియా పై చదవండి