ఏ దేవుడికి ఏ అక్షితలు వాడాలి...? అరటి ఆకును ఎలా వేసి వడ్డించాలి?

సోమవారం, 11 మే 2015 (14:16 IST)
పరమేశ్వరునికి తెల్లని అక్షితలూ, విష్ణుమూర్తికి పసుపు అక్షితలూ, స్త్రీ దేవతలకు కుంకుమ అక్షితలను వాడాలని పురాణాలు చెపుతున్నాయి.
 
ఇక అరటి ఆకులో భోజనం వడ్డించేటపుడు అరటి ఆకు చివరను కూర్చున్నవారికి ఎడమవైపు ఉండేలా వేయాలి. కుడివైపు వేసి వడ్డించరాదు. చివర లేకుండా ఉన్న అరిటాకులో భోజన చేయరాదు. అలాగే వడ్డించనూ కూడదు. అతిథిని తన కుడివైపు ఉంచి గృహస్తు భోజనాన్ని వడ్డించాలి. భోజనం చివరిలో అతిథికి యోగ్యమైన మజ్జిగ ఇవ్వాలి. పులిసినవి ఇవ్వరాదు.

వెబ్దునియా పై చదవండి