తమను తాము క్షమించుకోవడం అంటే?

సోమవారం, 18 ఆగస్టు 2014 (16:15 IST)
చాలా మంది తమను తమను తాము క్షమించుకోమంటూ సలహాలు ఇస్తుంటారు. అసలు దీని అర్థమేంటి. అలా ఎందుకు క్షమించుకోవాలి? 
 
ఈ లోకంలో తప్పు చేయనివారంటూ ఎవరూ లేరు. అలావుండే మనుషులు మహనీయులవుతారే కానీ మానవులు కారు. చేసిన తప్పును, దాని తాలూకూ పరిణామాలను పదేపదే తలపోయడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండబోదు కాగా, మనలో ఆత్మస్థైర్యం దెబ్బతినే ప్రమాదం లేకపోలేదు. అలాగే, తప్పు మరోమారు జరగకుండా చూడొచ్చు గానీ, దాని తాలూకూ జ్ఞాపకాలను చెక్కు చెదరనీయకుండా బుర్రలో పదిలపరచుకోవడం సమంజసం కాదు. 
 
ప్రతి క్షణం అది అలా జరగకుండా ఉంటే బాగుండేదని తలపోయడం తగదు. దీనివల్ల కలిగే ప్రతికూల భావనలు ఇబ్బంది పెడతాయి. అందువల్ల ఎపుడు కూడా జరిగిన తప్పులను క్షమించుకుంటూ మరోమారు అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా మంచి ఆలోచనల వైపు దృష్టిసారించాలని ఆధ్యాత్మిక నిపుణులు సలహా ఇస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి