నేను కోరుకునేది ఏదీ దక్కడం లేదే? ఏం చేయాలి? సద్గురూ.. ఈ సృష్టిలో ఏ శక్తి మీకు వ్యతిరేకమైంది కాదు. మీరు ఉపయోగించుకోవడాన్నిబట్టే ఒక శక్తి మీకు లాభానికో, నష్టానికో, సృష్టికో, విధ్వంసానికి కారణం అవుతుంది.
ఒక రోజు సూర్యోదయాన్ని ఫోటో తీయాలనుకుంటారు. ఆ రోజు ఒకటే మబ్బులు, ముసురు వాన పడుతుంది. మీ కోరిక నెరవేరలేదన్న కోపంతో, ప్రకృతి మీద అయిష్టంతో, మీ గదిలో ఓ మూల ముణుచుకుని కూర్చున్నంత మాత్రాన ప్రకృతి మారుతుందా?
ఒక బలమైన శక్తివల్ల మీరు అనుకున్నది జరగకుండా పోవచ్చు. అయితే చెయ్యదగ్గ, చేయగలిగినవాటిని చేయకుండా డీలాపడిపోవడం, చేతకానితనం, పిచ్చితనం అవుతుంది.