కాళ్లు ఊపితే మేనమామకు అరిష్టమా... నిజమేనా..?

గురువారం, 20 అక్టోబరు 2016 (11:31 IST)
మనం మంచం మీద లేదా ఎతైన కుర్చీలో కూర్చున్నప్పుడు కాళ్లు ఊపితే పెద్దవారు వచ్చి కోప్పడటం సహజమే. అలా కాళ్లు వూపటం వల్ల అరిష్టం అని కొందరు, మరికొందరు మేనమామకి కీడు జరుగుతుందని చెబుతూ ఉంటారు. అయితే కాళ్లు ఊపటం వల్ల నిజంగా కీడు జరుగుతుందా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
 
మన పూర్వీకులు విలువైన వస్తువులను, ఔషధాలను డబ్బును మంచాల కింద జాగ్రత్త పరిచేవారు. అలాగే మన పూర్వీకులకు తమలపాకు నమిలే తినే అలవాటు ఉండేది. తమలపాకు నమిలి ఉమ్మివేయటానికి పాత్రను మంచం కింద పెట్టేవారు.
 
అల్లరి చేసే పిల్లలు, తుంటరి పిల్లలు మంచం మీద కూర్చొని కాళ్ళు వూపితే మంచం కింద ఉన్న విలువైన వస్తువులు పగిలిపోయేవి. తుంటరి పిల్లలను కాళ్లు ఊపవద్దని చెబితే ఇంకా రెచ్చిపోయి ఊపేవారట. ఈ తుంటరి పిల్లల అల్లరిని ఆపడానికి కాళ్లు ఊపితే అరిష్టం అని మంచిది కాదని డబ్బు నష్టం జరగుతుందని చెప్పేవారు. అలాగే మేనమామకు మంచిది కాదని చెబితే కాళ్ళను ఊపటం మానేశారట. పెద్దవారు చెప్పే ప్రతి విషయంలోనూ ఒక రీజన్‌ ఉంటుంది. ఎతైన ప్రదేశంలో కూర్చుని కాళ్లను ఊపటం వల్ల శక్తి హరిస్తుందట. 

వెబ్దునియా పై చదవండి