కోరికలను అదుపులో వుంచు. అప్పుడే దైవాన్ని చేరే బాటలో సాగిపోవడానికి వెలుగు కనిపిస్తుంది. వ్యామోహం వల్ల, అస్థిరమైన కోర్కెల వల్ల కష్టము, దుఃఖము సంభవిస్తాయి. వ్యామోహము లేకపోతే అంతా ఆనందమే.
కోపం, స్త్రీ వ్యామోహం మనిషిని అంధుడిని చేస్తాయి. ఆధ్యాత్మిక మార్గంలో దైవాన్ని చేరడానికి ఈ రెండు శత్రువులను జయించాలి. నీకు దేవుణ్ణి చూడాలని వుంటే, నిన్ను నీవు తెలుసుకోవడం ఒక్కటే మార్గం.
నిందించేవాడు ఇతరుల మురికిని తన జిహ్వతో శుభ్రపరుస్తాడు. ఆధ్యాత్మికత అనేది ఒక జీవన విధానం. మన ఆలోచనలు, మన ప్రవర్తన, మన మనసులకు కలిగే భావాలు, స్పందనలు ఆధ్యాత్మిక చింతనలో భాగమే.