భగవంతుడు ఒక్కడే.. ఆయన పేర్లే వేరు వేరుగా ఉంటాయి..!

శనివారం, 10 అక్టోబరు 2015 (17:52 IST)
మనం భగవంతుడిని భక్తి శ్రద్ధతో ఏ పేర్లతో పిలిచినా పలుకుతాడు. కానీ, ఈ నామం లాభదాయకమని, ఇతర నామాలను కించపరచకూడదు. భగవంతుడొక్కడే. ఆయన పేర్లే వేరువేరుగా ఉంటాయి. కించపరిచితే పెద్ద అపరాధం. సారవంతమైన భూమిలో ఏ విత్తనం నాటినా మొలకెత్తుతుంది. మన హృదయ క్షేత్రములో ఏ నామాన్ని సంపూర్ణ విశ్వాసంతో తలచినా, అది మనకు కల్యాణప్రదం అవుతుంది. 
 
బోయవాడు వాల్మీకిగా మారడానికి రామనామాన్ని మరా, మరా అని జపించడమే కారణం కదా.. ఇంకా భగవంతుని ఆ నామం పట్ల ఆయనకున్న భక్తియే ఆయన్ని వాల్మీకిగా మార్చింది. అలాగే భగవంతుడిని నామాన్ని జపించడం లాభదాయకమా అని అనుమానపడటం మహా దోషం. నామస్మరణ చేయడం, ఆచరణలో పెట్టడం, ఆదర్శంగా జీవించడం ముఖ్యం. భగవంతుడు ప్రసన్నం కావాలంటే నామజపంతో పాటు కొన్ని విలువల ఆచరణ, పవిత్రత, పరోపకార భావనలు అవసరమని పండితులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి