ప్రతి చిన్న విషయాన్నీ పనిగట్టుకుని పెద్దది చేసుకుని..

సోమవారం, 23 ఫిబ్రవరి 2015 (16:30 IST)
ప్రతి చిన్న విషయాన్నీ పనిగట్టుకుని పెద్దది చేసుకుని దానితో సతమతమయ్యే మనస్తత్వం నుంచి విముక్తి కాక తప్పదని ఆధ్యాత్మిక గురువులు సలహా ఇస్తున్నారు. ప్రేమ ఆప్యాయతలతో జీవనం సాగించాలంటే నొచ్చకునే విధానానికి స్వస్తి పలికి మెచ్చుకునే విధానాన్ని పుణికి పుచ్చుకోవాలి. 
 
సమస్యపై చర్చించేటప్పుడు దాన్ని మరింత జటిలం చేయకుండా, ఎదుటి వ్యక్తి తన తప్పొప్పులను అంగీకరించేలా సరళంగా మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. నిద్ర, ఆహారం ఈ రెండూ శరీరంపైనా, ఆలోచనల పైనా గాఢమైన ప్రభావాన్ని చూపుతాయి. ఆరోగ్యకరమైన ఆహారం, అంతరాయం లేని నిద్ర ఇవి శారీరక, మానసిక ఆరోగ్యానికి చాలా తోడ్పడతాయి.

వెబ్దునియా పై చదవండి