ఎంత పనిచేసినా ఏమీ ఫలితం ఉండటం లేదు... చేతిలో పైసలు లేవు... పుట్టెడు దు:ఖములు అని విసిగి వేసారిపోతుంటారు కొందరు. అలాంటివారు ఆఖరి ప్రయత్నంగా ఈ 70 నామాలను ఉచ్చరిస్తే ఫలితం ఉంటుంది. నిత్యం వీటిని పఠిస్తూ, సూర్య భగవానుని చూస్తూ, మోకాళ్ళపై నిలబడి, రెండు చేతులతో రాగి పాత్రను పట్టుకొని, ఆ పాత్రను నీటితో నింపి, గన్నేరు మున్నగు ఎర్రని పూలు, ఎర్ర చందనం, దూర్వారాన్కురములు, అక్షతలు ఉంచాలి. ఆ పాత్రను నొసటికి ఎదురుగా ఉంచుకొని, సూర్య భగవానునికు అర్ఘ్యము వదలాలి. దీనితో అప్పటివరకూ పట్టుకని పీడిస్తున్న దరిద్రం.. దుఃఖము నుంచి ఉపశమనం కలుగుతుంది. భయంకర వ్యాధుల నుండి విముక్తిని పొందుతారు. ఆ 70 నామాలు ఇవే...