అలాంటివారికి నరకంలో కూడా చోటులేదు... స్వామి వివేకానంద

శనివారం, 25 ఆగస్టు 2018 (19:16 IST)
స్వామి వివేకానంద చెప్పిన ఎన్నో మాటలు ఆచరించదగినవి. ఆయన చెప్పిన సూక్తులు స్ఫూర్తిదాయకం. కొన్నింటిని చూద్దాం. 1. మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు దాని తర్వాత ఏమవుతుంది అని ఆలోచించవద్దు. దాన్ని ఒక అత్యున్నతమైన ఆరాధనగా చేయండి. ఆ పని చేస్తున్నంత వరకు మీ జీవితాన్ని పూర్తిగా దానికే అర్పించండి.
 
2. భయపడకు. నీవు ఎన్నిసార్లు పరాజయం పొందావో ఆలోచించకు. దానిని లెక్కచెయ్యకు. కాలం అనంతం. ముందుకు సాగిపో. నీ ఆత్మ శక్తిని మరల మరల కూడగట్టుకో, వెలుగు వచ్చే తీరుతుంది.
 
3. ప్రతి బాధ్యతా పవిత్రమైనదే. బాధ్యత పట్ల మనకుండే భక్తియే భగవంతునికి మనం చేయగలిగే అత్యుత్తమమైన అర్చన.
 
4. నిరంతర వికాసమే జీవనం. సంకోచమే మృత్యువు. తన వ్యక్తిగత సుఖాలనే చూసుకుంటూ, సోమరితనంతో గడిపే స్వార్థపరునికి నరకంలో కూడా స్థానం లేదు.
 
5. నిరంతరం శ్రద్దాభావంతో ఏమి చేసినా, నీకది మేలే. చాలా చిన్న పనినైనా, సవ్యంగా చేస్తే మహాద్బుత ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రతి వ్యక్తి తాను చేయగల ఎంత చిన్న పనినైనా శ్రద్దతో నిర్వహించాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు