ఇతరులను హింసించడం నేరం : స్వామి వివేకానంద

సోమవారం, 18 ఆగస్టు 2014 (16:22 IST)
"సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థిత మీశ్వరం!
నబినస్త్యాత్మ నాత్మానం తతోయాతి పరాంగతిమ్-2"
 
("ఆత్మను సర్వత్ర సమంగా చూసే యోగి ఆత్మను ఆత్మచేత హింసించుకో జాలడు. అతడు పరమగతినే పొందగలడు")- భగవద్గీత.
 
పై శ్లోకం ప్రకారం.. నీవు ఎవరిని హింసించినా, నిన్ను నీవే హింసించుకున్నవాడివవుతావని స్వామి వివేకానంద తన ఉపన్యాసాల్లో పేర్కొన్నారు. హింసించే కార్యాలన్నీ నీకు తెలిసినా, తెలియకున్నా, అన్ని చేతులతోనే జరిగిపోతుంటాయి.
 
పండితులలోనూ, పామరులలో కూడా మానవుడుంటాడు. నీవు చేసే ప్రతి కార్యము నిన్నే ఉద్దేశించిందవుతుందని, అందుచేత హింసకు పూనుకోక సానుభూతి పరుడివి కావాలని స్వామి ఉద్భోధించారు. 
 
మనం ఇతరులకు అపకారం చేస్తే.. అది తనకు తాను చేసుకున్నట్లవుతుందని, అదేవిధంగా ఇతరులను హింసించినా, తనను తాను హింసించుకున్నట్లవుతుందని స్వామి వివేకానంద వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి