ఫలితం ఆశించక, ఇతరులను నొప్పించకపోతే.. చేదు అనుభవాలుండవ్!

బుధవారం, 13 మే 2015 (17:05 IST)
మనకు కలిగే అనుభవాలు చేదు అనుభవమా కాదా అనేది వాటిని మనం స్వీకరిస్తామనే దాని మీద ఆధారపడుతుంది. ఒక వ్యక్తి విచారిస్తుంటే అతను నిజంగా విషాదసంఘటనల వల్ల విచారిస్తున్నాడని కాదు. ఆ సంఘటనను అతను విషాదంగా స్వీకరించడంవల్ల ఏర్పడినది ఆ విషాదం. కాబట్టి మనం చేస్తున్న పని నుండి మనం ఆశిస్తున్న ఫలితం బట్టి మన ఫీలింగ్ ఉంటుంది. 
 
మనం ఆశించిన మంచి లేదా లాభం కలగకపోగానే విషాదం వస్తుంది. కాని వాస్తవంలో అది మంచే అయినా ఆ మంచి మనం ఆశించిన స్థాయిలో లేకపోతే విషాదంగానే మిగిలిపోతుంది. కాబట్టి ఫలితం ఆశించక, ఇతరులను నొప్పించక, వారికి నష్టం కలిగించని ధర్మమార్గంలో మీరు ప్రయాణం చేస్తే మీకు చేదు అనుభవాలనేవి అంత త్వరగా కలగవు. ఒకవేళ కలిగినా వాటి చేదు అనుభవలుగా మీరు భావించని మానస్థిక స్థితికి చేరుకుంటారు. 

వెబ్దునియా పై చదవండి