పసుపు పచ్చని పువ్వులు, పసుపు రంగు ధాన్యం, గంధం మొదలైనవి ఈ పూజలో వినియోగిస్తారు. పసుపు పచ్చని వస్త్రాన్ని దానం చేయడం జరుగుతుంది. నియమానుసారంగా నిర్వహించబడిన ఈ ఉపవాస దీక్ష దేవ గురుడైన బృహస్పతిని ప్రసనున్ని గావించి మంచి ఫలితాలను సాధకుడికి చేకూర్చుతుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. ఈ విధంగా గురువారం బృహస్పతిని పూజిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని వారు సూచిస్తున్నారు.