శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఏంటది?

బుధవారం, 9 మార్చి 2022 (09:50 IST)
శ్రీవారి వేంకటేశ్వర స్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డు శుభవార్త చెప్పింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా నిలిచిపోయిన ఆర్జిత సేవలను తిరిగి పునరుద్ధరించేందుకు సమ్మతించింది. ఇందులోభాగంగా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ సేవలను తిరిగి పునఃప్రారంభిస్తున్నట్టు తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. 
 
ముఖ్యంగా శ్రీవారి ఆర్జిత సేవల్లో సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన, తిరుప్పావడ, మేల్ చాట్ వస్త్రం, అభిషేకం, కళ్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను తిరిగి ప్రారంభిచనున్నట్టు పేర్కొంది. గతంలో ఉన్న విధానంలోనే ఈ ఆర్జిత సేవలకు టిక్కెట్లు బుక్ చేసుకోవాలని తితిదే కోరింది. 
 
ఇక అడ్వాన్స్ బుకింగ్‌లో ఆర్జిత సేవలను బుక్ చేసుకున్నవారిని ఉదయాస్తమాన సేవ, వింశతి వర్ష దర్శిని సేవలు బుక్ చేసుకున్నవారిని ఏప్రిల్ 1 తేదీ నుంచి కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ ఆయా సేవలకు అనుమతించనున్నట్టు పేర్కొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు