ఒకే వ్యక్తి అన్నగా, తండ్రిగా, మామగా ఎలావుంటాడో.. భగవంతుడు కూడా?

మంగళవారం, 13 అక్టోబరు 2015 (18:34 IST)
భగవత్ తత్వం ఒక్కటేనని తెలియక బేధబుద్ధిని ప్రదర్శించకూడదు. ప్రత్యేకంగా శివకేశవులను వేర్వేరుగా చూడకూడదు. శివభక్తులను, విష్ణు భక్తులను ద్వేషించకూడదు. ఒక వస్తువు లేదా వ్యక్తి పరిస్థితులు సమయం, సందర్భాలను బట్టి మారతాయని తెలుసుకున్న వాడే జ్ఞాని, వివేకి. ఉదాహరణకు ఒకే వ్యక్తి కుమారునిగా, అన్నగా, తండ్రిగా, మామగా, తాతగా, బావగా మరిదిగా విభిన్న పాత్రలు పోషిస్తాడు. అదే విధంగా దైవశక్తి భిన్ననామాలతో ప్రకాశిస్తుంది. ఏ రూపమైనా వాటి మూల తత్త్వం, పరతత్త్వం ఒక్కటేనని గమనించాలి. 
 
అలాగే గురువు లేదా ఆచార్యుని పట్ల శ్రద్ధ, భక్తి విశ్వాసం లేకపోవడం భక్తిలో ఒక దోషం. గురుసన్నిధిలో దీక్ష, మంత్రోపదేశం పొందడం అనేవి ముఖ్యం. భక్తునికి భగవంతునికి గురువు వారధివంటివాడు. గురూపదేశం భగవంతుని కృపకు సాయపడుతుంది. గురువు ఎదుట వినయ విధేయతలతో, శ్రద్ధా భక్తితో వారి అనుగ్రహాన్ని పొంది, శ్రీ సూక్తులను విని, వాటికి అనుగుణంగా జీవితాన్ని సరిదిద్దుకుంటే భక్తి మార్గంలో పయనించడం సులభమవుతుంది. 

వెబ్దునియా పై చదవండి