ధ్యానం, ప్రార్థనతో కలిగే ప్రయోజనాలు ఏమిటి?

మంగళవారం, 19 మే 2015 (15:20 IST)
ధ్యానంకున్న శక్తి అంతా ఇంతా కాదు. ప్రతి రోజూ ఉదయం ధ్యానంతో రోజువారీ పనులు ప్రారంభించడం ఎంతో మేలు చేస్తుంది. మనసు పజడుతున్న ఒత్తిడిని పక్కకు నెట్టివేయగలిగిన శక్తి ధ్యానానికి ఉంది. ముఖ్యంగా నేటి ఉద్యోగాల్లో ఒత్తిడి భాగమైంది.  
 
అలాగే ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ప్రార్థన చేయడం అవసరం. ప్రార్థన అనగానే ఏదో పెద్దగా అనుకోకూడదు. ప్రార్థనలు మనస్సును తేలిక పరిచే సాధనాలు. మనం ఎంత వద్దనుకున్నా ఏదో ఒక రకమైన ఒత్తిడికి గురవుతుంటాం. 
 
మనసును వేధించే అంశంలో కొన్ని అర్థం లేనివి. పట్టించుకోవాల్సిన అవసరం లేకపోకపోయినా వాటిని వదిలించుకోలేం. అయితే వాటిని వదిలించుకోవాల్సిందే. ఆ తోడ్పాటును అందించేవి ప్రార్థనలే. ఊహకు అందని ఎన్నో అంశాలను సాధించిపెట్టే విధంగా ప్రార్థనలు చేస్తాయి. ప్రార్థనలు వాటిని విశ్వసించి అనుసరిస్తే తేడాను అతి సులభంగా అర్థం చేసుకుంటారు. ఎంతో మంది విజేతలు ప్రార్థనను విరివిగా ఉపయోగించుకున్నవారే.. 

వెబ్దునియా పై చదవండి