వివాహమయిన స్త్రీలు ఇంటి పేరు ఎందుకు మారుతుంది?

శనివారం, 10 ఆగస్టు 2019 (21:45 IST)
ఒక కుటుంబంలో సాధారణంగా భర్త వయసులో పెద్దవాడు కనుక అతను ఇంటి యజమాని అవుతాడు. వివాహమయిన తరువాత స్త్రీ తన ఇంటి పేరు మారుట వలన, కుటుంబ సభ్యుల మధ్య గట్టి ఐక్యతాభావము ఏర్పడుతుంది.

ముఖ్యంగా ఈ సాంప్రదాయము సమాజంలో స్త్రీ తన కుటుంబ పరువు, గౌరవ మర్యాదలు భుజాన మోస్తానని, వాటిని పెంచుతానని బాధ్యత స్వీకరించినట్లుగా చెబుతుంది.
 
ఈ సాంప్రదాయము స్త్రీ యొక్క వైవాహిక స్థితిని చెప్పడమే కాకుండా సమాజంలో ఆ స్త్రీ ఏ కుటుంబానికి చెందినది... ఎవరి భార్య అని చెబుతుంది. భారతీయ కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండటానికి ఈ సాంప్రదాయము ఒక కారణం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు