ఉంగరపు వేలు- బొటన వేలిని విభూతి ధారణకు ఉపయోగించవచ్చు. ఉంగరపు వేలు, బొటన వేలు.. ఈ రెండింటితో విభూతి తీసుకుని ఉంగరపు వేలితో మాత్రమే విభూతిని ధరిస్తే అనుకున్న కార్యాల్లో జయం వరిస్తుంది. ప్రశాంతత చేకూరుతుంది. మానసిక ఆందోళన దూరమవుతుంది. శుభఫలితాలుంటాయి. అలాగే విభూతి ధరించేటప్పుడు తూర్పు, ఉత్తరం వైపు నిలుచోవాలి. విభూతిని కింద రాలనీయకుండా ధరించాలి.