ఈ ఆలయంలో, గణేశుడు, తల్లిదండ్రులైన శివపార్వతులతో కలిసి దశముఖి అనే పాముపై ఆసీనులై వుంటారు. ఈ ఆలయంలోని భుజంగం శివశంభుని మెడకు, చేతులకు చుట్టబడి ఉంది. ఉజ్జయిని తప్ప ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి విగ్రహం లేదు. ఈ ఆలయంలో 11వ శతాబ్దానికి చెందిన విగ్రహం ఉంది. అందులో శివపార్వతులు ఆదిశేషునిపై ఆసీనులు కావడం విశేషం.