కలలో పామును చంపారా....?

శుక్రవారం, 2 జనవరి 2015 (19:23 IST)
హిందువు పూజించే జంతు జీవ రాశుల్లో అతి ముఖ్యమైనది పాము. పాము శివుని ఆభరణం. కాబట్టి పాము పుట్టకు పాలు పోసి, పూజించడం ఆనవాయితి. తద్వారా ఆ పరమ శివుని ఆశీర్వాదం సదా ప్రాప్తిస్తుందని హైందవుల గట్టి నమ్మిక.
 
అంతటి పవిత్రమైన పామును చంపితే. ఇక చెప్పేదేముంది మహా పాపం చుట్టుకున్నట్టే. అయితే అదే కలలో చంపితే భయపడాల్సిన అవసరం లేదు. మంచే జరుగుతుంది. 
 
ఇక పామును మెడకు చుట్టుకున్నట్లు కలలో కనిపిస్తే మాత్రం కాస్త జాగ్రత్త పడక తప్పదు. ఎందుకంటే పాము చుట్టుకుంటే కష్టాలు చుట్టుకున్నట్టేనట. అయినా భయపడకుండా ఆ మహాశివుని పూజించండి. 
 
ముఖ్యంగా పాము కలలో కనిపిస్తే ఇతరులకు చెప్పకుండా తలస్నానం చేసి, శివును పూజించడం మంచిది.

వెబ్దునియా పై చదవండి