అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు: వైభవంగా చక్రస్నానం!

FILE
చిత్తూరు జిల్లా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు తొమ్మిదో రోజు వైభవంగా కొనసాగాయి. శనివారంతో ఉత్సవాలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

చక్రస్నానం రోజున అమ్మవారికి తిరుమల నుంచి సారెను తీసుకురావడం ఆనవాయితీగా వస్తోంది. మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల మధ్య పసుపు, కుంకుమ, పూల రాశులతో సారెను తిరుపతి వీధుల నుంచి ఊరేగింపుగా తీసుకెళ్లారు. సారె ఉత్సవానికి గజరాజులు వెంట రాగా.. భారీగా భక్తులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

మరోవైపు తిరుచానూరు పద్మావతి అమ్మవారి చక్రస్నానమహోత్సవంలో భక్తుల మధ్య తోపులాట జరిగింది. శనివారం ఉదయం అమ్మవారి పంచమతీర్థం చక్రస్నానానికి పెద్ద భక్తులు హాజరయ్యారు. ఈ క్రమంలో పుష్కరిణిలోకి భక్తులను ఒక్కసారిగా అనుమతించడంతో ఈ తోపులాట జరిగింది.

ఈ ఘటనలో పలువురు భక్తులు గాయపడ్డారు. వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అమ్మవారి పంచమతీర్థం చక్రస్నానానికి పెద్ద భక్తులు హాజరయ్యారు. ధ్వజావరోహణంతో కార్తీక బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

వెబ్దునియా పై చదవండి