తిరుమల కొండపై వెలసిన వినాయకుడు

శ్రీ వేంకటేశ్వరుని సన్నిధానమైన తిరుమల కొండపై సహజసిద్ధంగా ఆదిపూజ్యుడైన వినాయకస్వామి వెలిశాడు. వెంకన్న ఆలయంలో పుష్కరిణికి ఆనుకుని ఉన్న రావిచెట్టులో విఘ్నేశ్వరుడు వెలిశాడు.

ఈ అద్భుతాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తకోటి తిరుమలకు తరలి వస్తున్నారు. మరోవైపు రావిచెట్టులో వెలిసిన వినాయకునికి భక్తులు ప్రత్యేక పూజలు చేయడం ప్రారంభించారు.

ఈ అద్భుతం విస్తృతంగా ప్రచారం కావడంతో తిరుమలకు వెళ్లిన భక్తులు కూడా విధిగా వినాయకస్వామికి దర్శించుకుని దీప దూప నైవేద్యాలు సమర్పించుకుంటున్నారు. దీనితో పెద్దగా భక్తుల సంచారం ఉండని పుష్కరిణి ప్రస్తుతం భక్తజన సంద్రంతో నిండిపోయింది.

వెబ్దునియా పై చదవండి