భక్తులతో కిటకిటలాడుతోన్న భద్రాద్రి కొండ

WD
సుప్రసిద్ధ భద్రాచలం రామస్వామి ఆలయంలో జరిగే శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణాన్ని తిలకించేందుకు భారీ ఎత్తున వస్తోన్న భక్తులతో భద్రాద్రి కొండ కిటకిటలాడింది. గురు, శుక్రవారాల్లో వేలాది మంది భక్తులు పవిత్ర గోదావరిలో స్నానమాచరించి రామాలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుంటున్నారు.

శుక్రవారం తెల్లవారు నుంచే అశేష భక్తజన సందోహంతో నిండిపోయింది. రాష్ట్రంలోని కర్నూలు, నెల్లూరు, నల్గొండ వంటి ఇతర జిల్లాల నుంచి తండోపతండాలుగా భక్తులు తరలి వస్తున్నారు. రామన్న కళ్యాణం కోసం భద్రాచలంలోని మిథిలా స్టేడియం విద్యుత్ దీపాలతో కళకళలాడిపోతోంది.

కళ్యాణ మండపానికి తూర్పు భాగాన భద్రాద్రి చతుర్భుజ రాముడు సీతాదేవికి తలంబ్రాలు పోస్తున్నట్లు, దరశరథుడు సతీ సమేతంగా జనకుడు లక్ష్మణ, భరత, శత్రగ్నుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. మండపం నాలుగు మూలలా హనుమంతుని విగ్రహాలను దివ్య సుందరంగా అలంకరించారు.

వెబ్దునియా పై చదవండి