రంజాన్ నెల ఉపవాసాలు నేటినుంచి ప్రారంభం

FileFILE
ముస్లింలకు అతిపవిత్రమైన రంజాన్ మాసం ఉపవాసాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. సోమవారం రాత్రి నెలవంక దర్శనంతో రంజాన్ నెల ప్రారంభమయింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ మసీదుల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు.

గత రాత్రి 7.30 గంటలకు ఆకాశంలో నెలవంక కనిపించగానే రాజధానిలోని మక్కామసీదుతో పాటు వివిధ మసీదుల్లో రంజాన్ మాసం ప్రారంభ సూచికగా సైరన్‌లు మోగాయి. నగరంలోని అన్ని మతాల వారు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.

ముస్లింలు అతిపవిత్రంగా భావించే ఈ నెలలో వారు అనేక దైవకార్యాలు చేస్తారు. ప్రతిరోజూ ఐదు సార్లు ప్రత్యేక ప్రార్థనలు జరుపుతారు. ఈ నెలలోనే అల్లా దైవదూత ద్వారా ఖురాన్‌ను ఆకాశం నుంచి పంపించారని ముస్లింల నమ్మకం. ఈ విశ్వాసంతో వీరు ముప్ఫై ఖురాన్ పారాలను పఠిస్తారు.

వెబ్దునియా పై చదవండి