సంపంగి ప్రాకారంలోనే తిరుమలేశుని సేవలు

FILE
కలియుగ వైకుంఠం తిరుమల వెంకటేశ్వరుని ఆలయంలో ఇకపై వారపు సేవలు సంపంగి ప్రాకారంలో జరుగనున్నాయి.

తిరుమల ఆలయంలో బంగారు వాకిలి వెలుపల గరుడాళ్వార్ సన్నిధి వద్ద సాగే వారపు సేవలను ఇకపై సంపంగి ప్రాకారంలోని కళ్యాణోత్సవ మంటపంలో నిర్వహించాలని తితిదే నిర్ణయించింది.

ప్రతి మంగళ, బుధ, గురువారాల్లో అష్టదళ పాద పద్మారాధన, సహస్ర కలశాభిషేకం, తిరుప్పావడ సేవలను ఆలయంలోని బంగారు వాకిలి వద్ద నిర్వహించడం ఆనవాయితీ. దీనివల్ల స్వామివారి దర్శనం దాదాపు రెండు గంటల పాటు నిలిచిపోతుంది. దీంతో భక్తుల రద్దీ పెరిగి పోతుంది.

భక్తుల సౌకర్యార్థం సందర్శన సమయాన్ని పెంచేందుకు ఈ మూడు సేవలను సంపంగి ప్రాకారంలోనే నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. ఇది త్వరలోనే అమలులోకి వస్తుందని టీటీడీ అధికారులు అంటున్నారు.

ఇదిలా ఉండగా.. వెంకన్న స్వామికి కానుకలు వెల్లువల్లా వస్తున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం హైదరాబాద్ నగరానికి చెందిన సుందర్శనరావు అనే భక్తుడు రూ. 29వేల విలువైన పది చక్రాల కుర్చీలను కానుకగా సమర్పించారు.

వెబ్దునియా పై చదవండి