సేవా టిక్కెట్లకు కూడా వేలిముద్ర వేయాల్సిందే!

FILE
తిరుమలేశుని దర్శనార్థం అధికారుల విచక్షణాధికార కోటా కింద జారీచేసే సేవా టిక్కెట్లకు కూడా గురువారం నుంచి వేలిముద్రలు వేయాలని తితిదే ప్రత్యేక అధికారి ఏవీ ధర్మారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బయోమెట్రిక్ విధానాన్ని అన్నింటికి వర్తింపజేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ధర్మారెడ్డి అన్నారు.

ఇప్పటివరకు బ్యాంకు ద్వారా జారీచేసే కరెంట్ బుకింగ్ టిక్కెట్లకు మాత్రమే బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేశారు. ఇకపై విచక్షణాధికార కోటాకింద జారీచేసే సేవా టిక్కెట్లు, వీఐపీ, సెల్లార్ దర్శన టిక్కెట్లు తదితరాలకు మొత్తం సభ్యులందరూ వెళ్లి వేలిముద్రలు వేయాల్సి ఉంటుంది.

ఇదిలా ఉంటే.. తిరుమల ఆలయంలో శ్రీవారి డాలర్లు మాయమైన కేసుకు సంబంధించి ఈ నెల 17 నుంచి ఐదురోజుల పాటు జరుగనుంది. ఈ కేసు విచారణకు రిటైర్డ్ న్యాయమూర్తి పాండురంగారావుతో ఏకసభ్య కమిటీని నియమించిన విషయం విదితమే.

వెబ్దునియా పై చదవండి