నెల్లూరు పట్టణంలో మూడోరోజూ ఘనంగా రొట్టెల పండుగ

సోమవారం, 26 అక్టోబరు 2015 (12:07 IST)
మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే బారాషాహిద్‌ రొట్టెల పండుగ నెల్లూరులో ఘనంగా జరుగుతోంది. మూడోరోజైన సోమవారం రొట్టెలను సమర్పించేందుకు తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. మూడోరోజు రొట్టె పట్టుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం. 
 
దీంతో కోర్కెలు తీర్చే స్వర్ణాల చెరువు వద్దకు చేరుకుని రొట్టెలు మార్చుకుంటున్నారు. వ్యాపార, సంతాన, ఆరోగ్య, ఉద్యోగ రొట్టెలకు ఈ పండుగలో బాగా డిమాండ్‌ ఉంది. రొట్టెలు మార్చుకున్న అనంతరం బారాషాహిద్‌ దర్గాలో సమాధులను భక్తులు దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 

వెబ్దునియా పై చదవండి