ఏప్రిల్ 14 నుంచి ఒంటిమిట్ట కోదండరాముడి బ్రహ్మోత్సవాలు

మంగళవారం, 29 మార్చి 2016 (13:28 IST)
కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామి ఆలయాన్ని తితిదే ఛైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... పురావస్తుశాఖ నిబంధనలు ఆలయ అభివృద్ధికి ఇబ్బందిగా ఉన్నాయని, వాటిని అధిగమిస్తామన్నారు. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో భక్తులకు అసౌకర్యాలు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 
 
ప్రపంచంలో తిరుమల శ్రీవారు అత్యంత ధనవంతుడు.. కోదండరాముడి బ్రహ్మోత్సవాల నిర్వహణకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. శ్రీవారి ఆధ్వర్యంలో జరిగే ఏకార్యక్రమానికైనా పెద్దపీట వేస్తామన్నారు. ఏప్రిల్‌ 14 నుంచి ఒంటిమిట్ట కోదండరాముడి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఏప్రిల్ 12వ తేదీన జరుగనున్నట్లు చదలవాడ తెలిపారు. ఇక ఏప్రిల్ 15న మహాకవి పోతన జయంతిని పురస్కరించుకుని కవి సమ్మేళనం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి