సరస్వతీ నది భూగర్భంలో ప్రవహిస్తోంది.. తుది ప్రకటన త్వరలోనే: ఉమాభారతి

బుధవారం, 2 మార్చి 2016 (14:33 IST)
సరస్వతీ నది భూగర్భంలో ఉన్నట్లు గుర్తించామని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి తెలిపారు. భారతీయ పురాణాల్లో, ఇతిహాసాల్లో ప్రముఖంగా పేర్కొన్న సరస్వతీ నది ఆచూకీని గుర్తించామని ఆమె పేర్కొన్నారు. అప్పటి సరస్వతి నది ప్రవహించినట్లు భావిస్తున్న మార్గంలో.. ప్రస్తుతం భూగర్భంలో ఒక నది ఉన్నట్లు గుర్తించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. 
 
దీనిపైన టాస్క్‌ఫోర్స్‌ తదుపరి అధ్యయనం చేస్తోందని.. నివేదిక వచ్చిన తర్వాత సరస్వతీ నదిపై తుదిప్రకటన చేస్తామన్నారు. గంగ-యమున-సరస్వతి నదులు ప్రవహిస్తున్నాయని రికార్డుల పరంగా పేర్కొంటున్నప్పటికీ సరస్వతి నది ఎప్పుడో అంతర్థానమైపోయింది. ఇస్రో సహకారంతో ఉపగ్రహాల ద్వారా కూడా అన్వేషణ ప్రారంభినట్లు ఉమాభారతి వ్యాఖ్యానించారు. 
 
టాస్క్ ఫోర్స్ హర్యానా - రాజస్థాన్ ప్రాంతాల్లో ప్రవహించినట్లు తెలుస్తోందని.. యుమునానగర్ విలేజ్‌లోని భూగర్భంలో నీటి ప్రవాహాలు ఉన్నట్లు గుర్తించినట్లు ఉమా భారతి వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని ఉమా భారతి తెలిపారు.

వెబ్దునియా పై చదవండి