వైభవంగా స్నపన పద్మావతీ అమ్మవారి తిరుమంజనం

గురువారం, 20 నవంబరు 2014 (17:45 IST)
వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుచానూరులో పద్మావతీ అమ్మవారి ఉత్సవ విగ్రహానికి గురువారం ఉదయం తిరుమంజన కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేకంగా తయారుచేసిన హారముతో పద్మావతీ అమ్మవారికి మరింత శోభ లభించింది. గురువారం కృష్ణ స్వామి ముఖమండపం వద్ద 12.30 గంటలకు విష్వక్సేన ఆరాధన, పుణ్యవచనం, నవకలిశాభిషేకంలు నిర్వహించారు.

 
ఈ కైంకర్యాల నిర్వహణకు కనీసం రెండు గంటల సమయం పట్టింది. ముఖ మండపాన్ని తిరుమల తిరుపతి దేవస్థాన ఉద్యానవన శాఖ ప్రత్యేకంగా అలంకరించింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా అనంతరం అష్టోత్తర శతకలిశా మండపానికి తీసుకెళ్ళి స్నపన తిరుమంజనం నిర్వహించారు.

వెబ్దునియా పై చదవండి