శబరిమలలో భక్తులు లేకుండానే ఆ పూజ.. ఏంటది?

సోమవారం, 20 ఆగస్టు 2018 (10:56 IST)
కేరళలో భారీ వరదల కారణంగా శబరిమల మునిగిపోయింది. ఈ క్రమంలో శబరిమల ఆలయంలో ఏటా నిర్వహించే నిరపుతిరి వేడుకలు ఈ ఏడాది అత్యంత సాదాసీదగా నిర్వహించారు. ఆలయానికి వచ్చే దారుల్లోని నదులు పొంగి ప్రవహిస్తూ ఉండటంతో ఈ ఏడాది భక్తుల రాకపై ఆంక్షలు విధించారు. దీంతో ఆలయ చరిత్రలోనే తొలిసారి భక్తులు లేకుండా ప్రతిష్టాత్మక పూజలు జరిగాయి.
 
కేరళను అతలాకుతలం చేస్తున్న వర్షాలు శబరి అయ్యప్ప స్వామి ఆలయంపైన కూడా ప్రభావం చూపాయి. ఏటా సాగుకు ముందు వరి కంకులను తెచ్చి స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం రైతులకు వీటిని అందజేస్తారు. దీనివల్ల పంటలు బాగా పండుతాయని రైతులతో పాటు స్థానికుల నమ్మకం. అయితే ఈ ఏడాది పంపానది పొంగిపొర్లుతూ ఉండటంతో భక్తుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. 
 
నిరతి పూజ కోసం ఆగస్టులో ఆలయాన్ని తెరుస్తారు. బాజాభజంత్రీల నడుమ మంగళ వాయిద్యాల మధ్య అత్యంత వైభవంగా వేడుకను నిర్వహిస్తారు. ఆలయ వర్గాలతో రాష్ట్రవ్యాప్తంగా ఉండే రైతులు, వివిధ ప్రాంతాల ప్రజలు ఈ పూజ కోసమే ఇక్కడకు వస్తారు. అలాంటిది వరదల కారణంగా  తొలి సారి అత్యంత సాధారణంగా జరిగిందని ఆల నిర్వాహకులు అంటున్నారు.  
 
ఆలయ చరిత్రలోనే తొలిసారిగా ఇలా జరిగిందని.. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని పూజను వాయిదా వేయాలని ప్రయత్నించిన సాధ్యం కాలేదని ప్రకటించింది. తప్పనిసరి పరిస్థితుల్లోనే భక్తులు లేకుండానే పూజలు నిర్వహించాల్సి వచ్చిందంటూ ఆలయ నిర్వాహకులు ప్రకటించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు