శబరిమలలో మహిళల ప్రవేశానికి అనుమతిలేదు: సుప్రీంకు తేల్చి చెప్పిన కేరళ సర్కారు

శనివారం, 6 ఫిబ్రవరి 2016 (12:49 IST)
సుప్రసిద్ధ ఆలయం శబరిమలలో మహిళల ప్రవేశానికి అనుమతించలేమని కేరళ సర్కారు శుక్రవారం సుప్రీం కోర్టులో పాత వాదననే పునరుద్ఘాటించింది. వందేళ్ల పాటు కొనసాగుతూ వస్తున్న ఆచారాన్ని, మహిళల నిషేధాన్ని రద్దు చేసి సంప్రదాయానికి పాతర వేయలేమని కేరళ సర్కారు తేల్చి చెప్పింది. పది నుంచ  50 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళలకు శబరిమల ఆలయంలో ప్రవేశం నిషిద్ధమని కేరళ సర్కారు పేర్కొంది. 
 
శబరిమలలోకి మహిళ ప్రవేశానికి అనుమతించాలని 2007లో దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో భాగంగా ఉమెన్ చాందీ ప్రభుత్వం సంప్రదాయానికే పెద్ద పీట వేయనున్నట్లు కోర్టుకు తేల్చి చెప్పింది. కాగా ఇప్పటికే మహారాష్ట్రలోని శనీశ్వరాలయంలో మహిళలకు ప్రవేశం నిషిద్ధంపై పెద్ద రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. 

వెబ్దునియా పై చదవండి