ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు, ఎప్పటి నుంచో తెలుసా?

శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (17:26 IST)
చిత్తూరు జిల్లా పుణ్యక్షేత్రాలకు ప్రసిద్ధి. ఇప్పటికే తిరుచానూరు పద్మావతి ఆలయంతో పాటు శ్రీనివాసమంగాపురంలో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అలాగే అప్పలాయగుంటలోను పవిత్రోత్సవాలను నిర్వహించడానికి టిటిడి సిద్థమైంది. 
 
ఈ నెల 13వ తేదీ నుంచి 15 వరకు పవిత్రోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు టిటిడిలో ఒక ప్రకటనలో తెలిపింది. సెప్టెంబర్ 12వ తేదీ సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం శాస్త్రోక్తంగా జరుగనుంది.
 
వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలిసీ తెలియక దోషాలు జరుగుతుంటాయి. వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. 
 
సెప్టెంబర్ 13వ తేదీన పవిత్ర ప్రతిష్ట, సెప్టెంబర్ 14వ తేదీన పవిత్ర సమర్పణ, సెప్టెంబర్ 15వ తేదీన మహాపూర్ణాహుతి కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ సంధర్భంగా మూడురోజుల పాటు ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. కోవిడ్-19 నిబంధనల మేరకు ఆలయంలో పవిత్రోత్సవాలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు